Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్కు చెందిన న్యాయవాద సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకుడు, హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యదర్శి సీహెచ్ కళ్యాణ్రావు సారధ్యంలో హైకోర్టు న్యాయవాదులు నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు.తెలంగాణ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.విభజన హామీలు పరిష్కరించాలని కోరారు.