Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెడికల్‌కాలేజీల నిర్మాణంపై ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక, ఆర్యోగశాఖల మంత్రి టీ హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవల్ని చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమనీ, దాన్ని చేరుకొనేందుకు అధికారులు మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పారు. బుధవారంనాడాయన ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్యారోగ్య, రోడ్లు, భవనాల శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణ పనుల్లో స్పీడ్ పెంచాలని చెప్పారు.