Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు సహా 13 భాషల్లో ప్రశ్నాపత్రం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశవ్యాప్తంగా 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ సహా పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూసెట్) నిర్వహించేందుకు కేంద్ర విద్యాశాఖ సిద్ధమైంది. ఒక్కో వర్సిటీ విడివిడిగా ప్రవేశ పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని కేంద్రం భావిస్తున్నది.
గత కొన్నేండ్లుగా నలుగుతున్న ఈ ప్రతిపాదన ఈ సంవత్సరం కార్యరూపం దాల్చనుంది. సీయూసెట్ను జూన్ లేదా జులైలో నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) భావిస్తున్నది.
ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. తెలుగు సహా 13 భాషల్లో ప్రశ్నాపత్రం రూపొందించే అవకాశమున్నది.