Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వరుసగా రెండోసారి వరల్డ్ ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ''వాయిస్ ఆఫ్ కస్టమర్'' గుర్తింపును ఇచ్చింది. 2021లో కోవిడ్ సమయంలో ప్రయాణీకుల అవసరాలను అర్థం చేసుకుని, దానికి తగిన చర్యలను తీసుకుంటూ చేసిన నిరంతర కషికి ఈ గుర్తింపు లభించింనట్టు జీఎంఆర్ ఎయిర్‌పోర్టు ప్రతినిధి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విమాన ప్రయాణంపై ప్రయాణీకుల విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో పోషించిన చురుకైన పాత్రకుగాను ఈ గుర్తింపు దక్కినట్టు తెలిపారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో నూతన వేరియెంట్లు బయటపడుతున్న నేపథ్యంలో ఎయిర్ పోర్టు ఆపరేటర్లు ప్రయాణికులకు అందించే సర్వీసుల విషయంలో ఎలాంటి మినహాయింపులూ లేకుండా అతి తక్కువ సమయంలో తమకు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రయాణికుల భద్రతను దష్టిలో ఉంచుకొని హైదరాబాద్ విమానాశ్రయం సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేసింది. కోవిడ్ ప్రపంచంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేయగా, అందులో ఎక్కువగా ప్రభావితమైనది విమానయాన రంగం. విమాన ప్రయాణంపై ప్రయాణీకుల నమ్మకాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో హైదరాబాద్ విమానాశ్రయంలో కాంటాక్ట్‌లెస్ ఎలివేటర్లు, కాంటాక్ట్‌లెస్ ఇన్ఫర్మేషన్ డెస్క్‌లు, డిజిటల్ లావాదేవీలు, షాపింగ్ కోసం యాప్ బేస్డ్ టెక్నాలజీలు, , ప్యాసింజర్ బ్యాగేజ్ యొక్క శానిటైజేషన్, క్యాబ్‌ల పరిశుభ్రత, గాలి శుభ్రతను పెంచడానికి ఫిల్టర్లు వంటి అనేక చర్యలు చేపట్టింది.జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ సీఇఓ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ 'వరుసగా రెండోసారి ఈ గుర్తింపును పొందడం మాకు దక్కిన గౌరవం. మా భాగస్వాములందరి సహకారంతోనే ఇది సాధ్యమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణికుల విశ్వాసాన్ని పొందడానికి ఉమ్మడిగా కషి చేయడం చాలా అవసరం. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మేం విమానాశ్రయంలో కోవిడ్ నిబంధనల అమలుకు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు, ప్రయాణికుల భద్రత కోసం వీడియో అనలిటిక్స్ వినియోగం, అదనపు ఆర్టీ-పీసీఆర్ ల్యాబ్ ఏర్పాటు వంటి అనేక చర్యలు తీసుకున్నాం. విమానాశ్రయ ఆపరేటర్‌గా మాకు ప్రయాణికుల భద్రత అత్యంత ముఖ్యం. దానికోసం అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటాం'' అని అన్నారు.