Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కర్నాటక రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్ రాజకీయాలు చేయెద్దని అవాజ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ అబ్బాస్ కోరారు. విద్యార్థుల భవిషత్తుతో ఆటలాడొద్దని హితవు పలికారు. రెండు నెలల్లో పరీక్షలున్న నేపథ్యంలో విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని వ్యాఖ్యానించారు. మతస్వేచ్ఛ పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లో అవాజ్ మహిళల సమావేశంలో మాట్లాడుతూ మతం కన్నా దేశం గొప్పదన్నారు. జాతీయ సమత్రకు మతం హాని చేస్తుందని గుర్తు చేశారు. రాజకీయాల కోసం విద్యార్థుల మధ్య మంటపెట్టరాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు విద్యార్థులకు మంచి విద్యను అందించేందుకు కృషిచేయాలని సూచించారు. రాజ్యాంగం ప్రకారం మత సంప్రదాయాలను పాటించే స్వేచ్ఛ ఆయా తరగతులకు ఉందని చెప్పారు. మతకలహాలకు వ్యతిరేకంగా లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అవాజ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఫత్అంజుమ్ అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్షులు అజీజ్ అహ్మద్ ఖాన్, మహిళా నాయకులు మోహిన్ బానో, షేక్రిజ్వానా, సయిదా తన్వీర్ అలియా తదితరులు పాల్గొన్నారు.