Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ, ఏపీ సీఎస్‌లకు కేఆర్ఎంబీ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శ్రీశైలం రిజర్వాయర్ వద్ద విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కష్టానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) స్పష్టం చేసింది. విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకొవద్దని ఇరు రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు కేఆర్ఎంబీ సభ్యుడు ఎల్బి ముత్తంగి గురవారుం రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాశారు. ఈ సంవత్సరం మే వరకు తెలంగాణకు మూడు టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు ఆరు టీఎంసీలు తాగునీటి అవసరం ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌లో 809.90 ఫీట్ల (34.24టీఎంసీలు) మేరకు నీరు ఉందనీ, అది ఎండీడీఎల్ కంటే తక్కువనీ, ఇరురాష్ట్రాల నీటి డిమాండ్లను తీర్చలేనిపరిస్థితి నెలకొంటుందన్నారు.