Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థ విత్తన పరీక్షా కేంద్రానికి అత్యున్నత స్థాయి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఆయా నిపుణుల రాష్ట్రంలో విత్తన రంగం పురోగమనంలో ఉందని తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో తమ ప్రభుత్వం అంతర్జాతీయ హంగులతో 'తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రం' పేరుతో విత్తన పరీక్ష ప్రయోగశాలను నిర్మించిందని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులను పెంచటంలో నాణ్యమైన విత్తనమనేది కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఏటా విత్తన ఎగుమతులు పెరుగుతున్నాయని వివరించారు. గడిచిన నాలుగేండ్లుగా ల్యాబ్ నిర్మాణం చేపట్టి, ఆధునాతన విత్తన పరీక్ష ప్రమాణాలను పెంచామని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా నాణ్యతా పరీక్షలతోపాటు సింగల్‌విండో పద్దతిలో విత్తన ఎగుమతి చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.