Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్టీసీ బస్సుల అలైటింగ్ పాయింట్ల వద్ద ప్రయివేటు క్యాబ్లను అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేస్తామని ఆ సంస్థ ఎమ్డీ వీసీ సజ్జన్నార్ వెల్లడించారు. ఛార్జీల పెంపు నిర్ణయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు. గురువారం హైదరాబాద్లో 'టీ-శాట్' నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం రాయితీనిస్తే 300 ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఇటీవల 2,250 బస్సులను పునరుద్ధరించటంతోపాటు 850 కొత్త సర్వీసులను విడుదల చేశామని ఆయన వివరించారు.