Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రయాణీకులకు మరింత దగ్గరయ్యేందుకు టీఎస్ ఆర్టీసీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గరుడ ప్లస్ బస్ ఛార్జీలను తగ్గించింది. తద్వారా రాజధాని బస్సుల ఛార్జీలతోనే ఇప్పుడు గరుడ ప్లస్ బస్సుల్లో ప్రయాణం చేయటానికి వీలు కల్పించింది. సవరించిన, తగ్గించిన ఈ ఛార్జీలు, సంబంధిత షెడ్యూల్, ప్రత్యేక సర్వీసులకు మార్చి 31 వరకు వర్తిస్తాయని ఆర్టీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే అంతర్రాష్ట సర్వీసులకు... తెలంగాణ సరిహద్దు దాటిన తర్వాత అంతకుముందు ఉన్న ఛార్జీలే వర్తిస్తాయని పేర్కొంది. దీంతోపాటు హైదరాబాద్-బెంగళూరు మార్గంలో నడిచే ఏసీ సర్వీసులకు మాత్రం తగ్గింపు ఛార్జీలు వర్తించబోవని స్పష్టం చేసింది.
యువ ఐఏఎస్ ప్రత్యేక వివాహ ఆహ్వాన పత్రిక...
యువ ఐఏఎస్ అధికారి, నిజామాబాద్ అసిస్టెంట్ కలెక్టర్ మకరందు (అండర్ ట్రైనీ)... తన వివాహం సదర్భంగా విత్తనాలతో తయారు చేసిన ప్రత్యేక ఆహ్వాన పత్రికను ఆర్టీసీ ఎమ్డీ సజ్జన్నార్‌కు గురువారం అందజేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను వివరించేందుకే తాను ఇలాంటి ఆహ్వాన పత్రికను తయారు చేయించినట్టు ఆయన తెలిపారు. ఆ పత్రికను మాస్క్‌గా ఉపయోగపడే సంచిలో ఉంచి ఆయన సజ్జన్నార్‌కు అందజేశారు. మకరందు వివాహం ఈనెల 11న జరగనుంది. వినూత్న పద్ధతుల్లో ఆలోచించిన ఆయన్ను... సజ్జన్నార్ అభినందించారు.