Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఆటోమెటిక్ టికెట్ వెండిరగ్ మెషిన్ల (ఏటీవీఎమ్‌లు)తో టికెట్ల కొనుగోలు కోసం క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ ద్వారా టికెట్ చార్జీ చెల్లించే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నూతన సౌకర్యంతో ఏటీవీఎమ్‌లో ప్రయాణ వివరాలు నమోదు చేశాక టికెట్ చార్జీ చెల్లింపునకు ప్రస్తుత ఆప్షన్లకు అదనంగా పేటీఎమ్ ద్వారా యూపీఐ, ఫ్రీచార్జి ఆప్షన్లను జోడించామని తెలిపారు. ఆ రెండింటిలో ఏది నొక్కినా ఏటీవీఎమ్పై స్క్రీన్‌పై క్యూఆర్ కోడ్ కనిపిస్తుందనీ, దానిని స్కాన్‌చేసి ప్రయాణికులు టికెట్ చార్జీ చెల్లించవచ్చునని పేర్కొన్నారు. ఆ వెంటనే మెషిన్ ద్వారా టికెట్ వస్తుందని తెలిపారు. అన్రిజర్వ్డ్, ఫ్లాట్‌ఫారమ్ టికెట్లు కొనుగోలు చేసే వారికి ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు.