Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిత్రపురి సాధన సమితి డిమాండ్
- నాంపల్లిలో ధర్నా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్లోని చిత్రపురి కాలనీలో తెలుగు సినీ వర్కర్స్ కో-ఆపరేటివ్ సొసైటీకి సంబంధించి అవినీతికి పాల్పడిన కమిషనర్ వీరబ్రహ్మయ్యను వెంటనే అరెస్టు చేయాలని సీఐటీయూ సీనియర్ నాయకులు కె.ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ అవినీతి బాగోతానికి సపోర్టు చేస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇదే అంశంపై చిత్రపురి సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం నాంపల్లిలోగల కో-ఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరరావు మాట్లాడుతూ... చిత్రపురి కాలనీకి సంబంధించి 2005-2020 మధ్యనున్న కమిటీ అన్ని విధాలుగా కో-ఆపరేటివ్ చట్టాలను ఉల్లంఘించిందని తెలిపారు. ఈ విషయంపై సాక్ష్యాధారాలతో సహా గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని వివరించారు. అయినా వారు స్పందించకపోవటంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. ఈ అంశంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలను నాలుగు నెలల్లో సరిదిద్దాలటూ కోర్టు చెప్పినా కమిషనర్ పట్టించుకోలేదని తెలిపారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో చిత్రపురి సాధన కమిటీ అధ్యక్షుడు కస్తూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సీహెచ్ భద్ర, మురళీధర్ దేశ్పాండే, సంకూరి రవీందర్, మల్లిక, లతాశ్రీ తదితరులు పాల్గొన్నారు.