Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో బీడీఎల్ సీనియర్ అధికారులు గురువారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని రామానుజాచార్య విగ్రహాన్ని సందర్శించేందుకోసం ఆయన రాష్ట్రానికి విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీడీఎల్ విశ్రాంత సీఎమ్‌డీ సిద్ధార్థ మిశ్రా, డైరెక్టర్లు ఎన్పీ దివాకర్, పి.రాధాకృష్ణ తదితరులు రాజ్‌నాథ్‌తో సమావేశమయ్యారు. సంస్థ ప్రస్తుతం రూ.11,400 కోట్ల ఆర్డర్లతో ఉందని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ క్రమంలో దేశీయ ఆర్డర్లతోపాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆర్డర్లను పెంచేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.