Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర బడ్జెట్‌పై శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించనున్నారు. పట్నం, సీఐటీయూ, ఐద్వా, ఏఐకేఎస్, వ్యకాస సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సులో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, ఆర్థికవేత్త డి.పాపారావు, ఏఐఐఈఏ అధ్యక్షులు వి.రమేశ్ వక్తలుగా ప్రసంగిస్తారని పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిజి నర్సింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. సదస్సుకు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.