Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్జీటీ తీర్పుతో తెలంగాణకు ఎదురుదెబ్బ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని శ్రీరాంసాగర్ ఎడమకాలువ పరిధిలోని గౌరవెల్లి రిజర్వాయర్ పనులను నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి) చెన్న్తె బెంచ్ తీర్పునిచ్చింది. అలాగే పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేపట్టరాదని జస్టీస్ రామకష్ణ, సత్యగోపాల్ బెంచ్ ఆదేశించింది. ఇవే అంశాలపై గురువారం ఎన్జీటిలో విచారణ జరిగింది. ఏపీ,తెలంగాణ తరపున వాదనలు వినిపించారు. రిజర్వాయర్ నిర్మాణ ఉల్లంఘనలపై ఈమేరకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర పర్యావరణ శాఖ షోకాజ్ నోటీసులు జారీచేసిం ది. షోకాజ్ నోటీసుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎన్జీటీ కూడా ఉత్తర్వులిచ్చింది.పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా ప్రాజెక్టు పరిధిని విస్తరించారని సంయుక్త కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర పర్యావర ణ శాఖ చర్యలు చేపట్టింది.శ్రీరాంసాగర్ వరద కాలువ ప్రాజెక్టులో భాగంగా గౌరవెల్లి రిజర్వాయర్ సామర్ధ్యాన్ని పెంచారంటూ ఎన్జీటీలో కేసు వేసిన విషయమూ విదితమే. కాగా రిజర్వాయర్ పరిధిని పెంచలేదన్న తెలంగాణ వాదనను ఎన్జీటి తోసిపుచ్చింది. సంయుక్త కమిటీ నివేదిక ఆధారంగా గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణంలో మార్పులు చేసినట్టు గుర్తించింది. ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయినట్టు సంయుక్త కమిటీ నివేదిక తేల్చింది.