Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి బదులు కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జనగామలో టీఆర్ఎస్ గూండాల చేతిలో గాయపడ్డ తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు కూడా వెళ్లే హక్కు లేదా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపేందుకు యత్నించిన టీచర్లను అడ్డుకుని టీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళనలకు అనుమతి ఇవ్వడమేంటని నిలదీశా రు.గాయపడ్డ తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లనీయకుండా బీజేపీ నేతలను హౌజ్ అరెస్టు చేయడాన్ని ఖండించారు. సీఎం కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌కు పరిమితం చేసే రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు.