Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్‌రావుకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు 2022-23 రాష్ట్ర బడ్జెట్లో రూ.1,200 కోట్లు కేటాయించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి టి హరీశ్‌రావుకు గురువారం ఆయన లేఖ రాశారు. విశ్వవిద్యాలయాలకు కేటాయింపులు చాలా తక్కువగా చేయడం వల్ల ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నాయని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో వర్సిటీలు నిర్వీర్యమవుతున్నా యని విమర్శించారు.
సమస్యలు పెండింగ్‌లో ఉంటున్నాయని వివరించారు. వర్సిటీ కాలేజీలు, హాస్టళ్లు, గ్రంథాలయం, మెస్‌తోపాటు ఇతర మౌలిక వసతతుల కల్పన సరిగ్గాలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిధుల కొరతతో అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి సకాలంలో జీతాలిచ్చే పరిస్థితి లేదని తెలిపారు. దీంతో వర్సిటీల అభివృద్ధి కుంటుపడుతున్నదని పేర్కొన్నారు. వచ్చే రాష్ట్ర బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలనీ, వర్సిటీల అభివృద్ధికి సహకరించాలని కోరారు.
విశ్వవిద్యాలయాల బడ్జెట్ కేటాయింపులు
విశ్వవిద్యాలయం 2021-22 కేటాయింపు 2022-23కి అభ్యర్థనలు
1. ఉస్మానియా 353.89 కోట్లు 650 కోట్లు
2. కాకతీయ 90.93 కోట్లు 170 కోట్లు
3. తెలంగాణ 27.17 కోట్లు 60 కోట్లు
4. శాతవాహన 9.95 కోట్లు 25 కోట్లు
5. పాలమూరు 7.58 కోట్లు 25 కోట్లు
6. మహాత్మాగాంధీ 22.28 కోట్లు 50 కోట్లు
7. జేఎన్టీయూహెచ్ 34.01 కోట్లు 60 కోట్లు
8. జేఎన్ఏఎఫ్ఏయూ 18.56 కోట్లు 35 కోట్లు
9. ఆర్జీయూకేటీ 23 కోట్లు 50 కోట్లు
10. బీఆర్ అంబేద్కర్ 11.94 కోట్లు 25 కోట్లు
11. తెలుగు 28 కోట్లు 50 కోట్లు
మొత్తం 627.31 కోట్లు 1,200 కోట్లు