Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ
నవ తెలంగాణ వెల్డండ
వెల్దండ మండలం కొట్ర గ్రామంలో రామోజు ప్రభావతి, దేశమోని సురేష్ కుటుంబాలకు గ్రామ సేవా సమితి చేయూతనందించింది.. కొట్ర గ్రామానికి చెందిన రామోజీ ప్రభావతి, అదేవిధంగా దేశమోని సురేష్ అనే వ్యక్తులు ఇటీవల మతి చెందారు. దీంతో కొట్ర గ్రామ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పొనుగోటి రవీందర్ రావు ఆధ్వర్యంలోఇరు కుటుంబాలకు వేర్వేరుగా 50 కేజీల బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. రామోజు ప్రభావతి, ఆమె భర్త మాధవాచార్యులు ఇద్దరు మతి చెందడంతో వాళ్ల కుమారులు భాను చింటు లు అనాధలుగా మిగిలారు. దీంతో వారిని పరామర్శించి, ఓదార్చారు. బియ్యం, 9 రకముల సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు విష్ణువర్ధన్ రావు, హరిచంద్ర ప్రసాద్, గ్రామ సేవా సమితి నాయకులు వెంకటయ్య, నాగరాజు గౌడ్, బూత్కూరి మల్లేష్, బాల్ రాజ్, , రామస్వామి, విజరు కుమార్, సురేష్ యాదవ్, సత్యం, వెంకటేష్, రామాచారి, లక్ష్మణా చారి, చందు చారి తదితరులు ఉన్నారు.