Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వుల్ని ఆచరణలో పెట్టరా?
- ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: అప్పులతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇస్తామని 2015లో ఇచ్చిన జీవో ప్రకారం పరిహారం ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జీవో ప్రకారం 133 కుటుంబాలకు రూ. 6లక్షలు చొప్పున పరిహారం ఇస్తామన్న ఉత్తర్వులు అమలు కాలేదని సోషల్ వర్కర్ కొండల్‌రెడ్డి పిల్ వేశారు. గడువు ఇస్తే వివరాలు అందజేస్తామని ప్రభుత్వం చెప్పడంపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జీవో అమలు చేయనిపక్షంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఏప్రిల్ 6న జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ. జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీ చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న 133 మంది రైతుల కుటుంబాలకు రూ.6 లక్షలు చొప్పున పరిహారం ఇస్తామన్న జీవో అమలు చేసే తీరిక లేదా అని ప్రశ్నించింది. జీవో ఇచ్చి వదిలేస్తే ఎలాగని ప్రశ్నించింది.
వనమా రాఘవేంద్రరావుకు చుక్కెదురు
వేధింపుల కారణంగా ఒక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావుకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. రామష్ణ, భార్య పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడిన కేసులో రాఘవేంద్రరావు జైల్లో ఉన్నారు. కొత్తగూడెం కోర్టు బెయిల్ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో హైకోర్టులో అప్పీల్ చేసినా ఫలితం లేకపోయింది. బెయిల్ ఇవ్వరాదని పోలీసులు చేసిన వాదనతో జస్టిస్ కె.లలిత ఏకీభవించి బెయిల్ మంజూరుకు నిరాకరించారు. విచారణను 2 వారాలకు వాయిదా వేశారు
కోఠి మెటర్నటీ ఆస్పత్రిలో సమస్యలపై హైకోర్టు ఆగ్రహం
కోఠిలోని ప్రభుత్వ మెటర్నిటీ ఆసుప్రతిలో సౌకర్యాల కల్పన విషయంలో ప్రభుత్వం కాలయాపన చేయడంపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కోర్టుకు సహాయం చేసేందుకు నియమితులైన న్యాయవాది ఇచ్చిన రెండు నివేదికల్లోని సమస్యలను పరిష్కరించలేదని అసంతృప్తిని వ్యక్తం చేసింది.