Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మేడారం జాతరకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పని చేయాలని సంబంధిత శాఖల ఉన్నతాధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతరకు కోటి మంది భక్తులు హాజరు కావచ్చని తెలిపారు. ఆర్టీసీ ద్వారా 3,850 బస్సులు నడిపి 21 లక్షల మంది ప్రయాణికులను చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మేడారంలో ప్రధాన ఆస్పత్రి ఏర్పాటుతో పాటు మరో 35 హెల్త్ క్యాంపుల ఏర్పాటు చేసినట్టు చెప్పారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, తొక్కిసలాట కాకుండా గతంలో అనుభవం ఉన్న దాదాపు 9000 పోలీసు అధికారులను విధుల్లో నియమించామని తెలిపారు.
గవర్నర్కు ఆహ్వానం
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను ఆహ్వానించారు. శుక్రవారం రాజ్ భవన్లో షెడ్యూల్డ్ తెగల శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టీనా జెడ్ చొంగ్తూ, దేవాదాయ శాఖ కార్యదర్శి వి.అనిల్ కుమార్ ఆమెను కలుసుకుని జాతరకు ఆహ్వానం పలికారు.