Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చినజీయర్‌స్వామి రియల్ ఎస్టేట్ వ్యాపారి
- నేడు వివిధ పార్టీలు, సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం
- విలేకర్ల సమావేశంలో మందకృష్ణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలనీ, లేదంటే మరింత ఉధృతంగా ఉద్యమాన్ని నిర్మిస్తామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో కేసీఆర్ వ్యాఖ్యలను నిరసించే పార్టీలు, సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రంలో పెరుగుతున్న వ్యతిరేకతను దారిమళ్లించేందుకు రాజ్యసభలో మోడీ వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారని చెప్పారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కేసీఆర్ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టటం నైతికత కాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో దళితులు ఎవరూ పాల్గొనకూడదని చెప్పారు. చినజీయర్ స్వామి రామానుజుడి విధానాలకు వ్యతిరేకమని వివరించారు. ఆయన రియల్ఎస్టేట్ వ్యాపారని విమర్శించారు. రామానుజుడి విగ్రహావిష్కరణకు రాష్ట్ర పతిని ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తీగల ప్రతీప్గౌడ్, రేగడి సత్యం, కోంటూరి రాజ ఎల్లయ్య, డప్పు మల్లిఖార్జున్, విజయరావు తదితరులు పాల్గొన్నారు.