Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ- సిటీబ్యూరో
ఎన్నో ఏండ్లుగా దళితులు సాగు చేసుకుంటూ బతుకుతున్న భూములను వారికే ఇవ్వాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ మీర్పేట్ పరిధిలోని సర్వే నెం.46, 61లోని భూమిని దళితులలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ ఉన్న భూమిలో దాదాపు వంద కుటుంబాల దళితులు తాతలు, తండ్రుల కాలం నుంచి సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు.
ప్రస్తుతం అదే భూమిలో ఓ అడ్వకేట్ స్వలాభం కోసం రిక్షా ఫిల్లర్స్ అనే సంఘాన్ని ఏర్పాటు చేసి, కోర్టుల్లో కేసులు వేసి, ప్రభుత్వ భూములను తీసుకొని ప్లాట్స్ చేసి అమ్ముకుంటున్నాడని చెప్పారు. ఈ భూమిని దళితులకే ఇవ్వాలని, రెవెన్యూ రికార్డుల్లో దళితుల పేర్లను నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కనకయ్య, సామెల్, ఉపాధ్యక్షులు ప్రకాష్ కారత్, ఎల్లయ్య, బాధితులు దాసరి బాబు, భాస్కర్, పుట్టమ్మ, పెద్దలక్ష్మి, బాలరాజు, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.