Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఏజెన్సీ హక్కులను కాపాడ్డంలో గిరిజన సంక్షేమ శాఖ విఫలమైందని టీఎస్‌టీటీఎఫ్ అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్‌నాయక్ విమర్శించారు. 317 జీవో ద్వారా అన్యాయమైన ఉద్యోగ, ఉపాధ్యాయులు దామోదరం సంజీవయ్య భవన్ చుట్టూ తిరుగుతున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను జిల్లా, జోన్, మల్టీ జోన్‌కు సర్దుబాటు చేసే క్రమంలో ఏజెన్సీ హక్కు లను అధికారులు తుంగలో తొక్కారని పేర్కొన్నారు. అన్యా యానికి గురైన ఉపాధ్యాయుల అప్పీళ్లను గిరిజన సంక్షేమ శాఖ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షం లో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.