Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత వాయు సేనకు ఫైటర్ పైలెట్‌గా ఎంపికైన కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్‌కు చెందిన పి.అశోక్ సాయికి రాష్ట్ర షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎస్డబ్ల్యూఇఐఎస్) కార్యదర్శి రోనాల్డ్ రాస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పేద పిల్లల కోసం సైనిక్ స్కూళ్లను నడిపిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రోనాల్డ్ రాస్ తెలిపారు. తాను ఎంపిక కావడానికి ప్రోత్సహించిన సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల, ఉపాధ్యాయులకు అశోక్ సాయి కృతజ్ఞతలు తెలిపారు.