Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంపై ప్రధాని మోడీ చేసిన అమానవీయ దాడిని పలువురు వక్తలు ఖండించారు. పార్లమెంట్ చేసిన నిర్ణయాన్నే ప్రధాన మంత్రి ఖండించినట్టు మోడీ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు.
శుక్రవారం హైదరాబాద్‌లో ఫోరం ఫర్ తెలంగాణ ఆధ్వర్యంలో 'తెలంగాణ ఏర్పాటుపై ఎందుకీ కక్ష' అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ జాతీయ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజనపై పదేపదే మోడీ చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానపర్చేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలంపాటు పోరాడి, వేలాది మంది రాష్ట్ర సాధనకోసం మరణించారని గుర్తు చేశారు.
రాష్ట్రంపై కనిపించని దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూ డెమెక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె గోవర్థన్, గుజ్జకృష్ణ తదితరులు మాట్లాడారు.