Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిరిసిల్లలో మళ్లీ సర్వే చేసి అనర్హుల పేర్లు తొలగించాలి
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ర్యాలీ,కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీకి డ్రాలో పేర్లు రాని అర్హులకు ప్రభుత్వం వెంటనే స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలని సీపీఐ(ఎం) నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం బివైనగర్లోని సీపీఐ(ఎం) కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు పేదలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ఆఫీస్ ఎదుట పెద్దఎత్తున ధర్నా చేశారు. అనంతరం ఆర్డీవో శ్రీనివాస్‌కు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్దిదారుల వ్యక్తిగత దరఖాస్తు ఫారాలతో పాటు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడుతూ..ఇండ్ల కోసం అధికారులు అనేక దఫాలుగా సర్వే చేశారన్నారు.చివరకు సిరిసిల్ల పట్టణానికి సంబంధించి 2767 మందిని అర్హులుగా గుర్తించారని తెలిపారు. కానీ డ్రా పద్ధతిలో ఎంపిక చేయడం వల్ల దాదాపు 800మందికి ఇండ్లు రావడం లేదన్నారు. దీంతో అర్హులైన వారికి కూడా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అర్హులుగా గుర్తించి డ్రాలో పేర్లు రాని వారందరికీ ఇండ్లు అందించాలని కోరారు. లేనిపక్షంలో డ్రాలో పేరు వచ్చిన వారితో పాటుగా వీరందరికీ కూడా ఇండ్లు కట్టుకోవడానికి స్థలం కేటాయించి,5లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అలాగే, మళ్లీ సర్వే చేసి ఎంపికైన వారిలో అనర్హులను తొలగి ంచాలని కోరారు.అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చే వరకు పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు.అందులో భాగంగా శనివారం మున్సిపల్ ఆఫీస్ ముందు వంటావార్పు కార్యక్రమం చేపడతామని చెప్పారు.ఈ కార్యక్రమంలో నాయకు లు గన్నారం నర్సయ్య, కోడం రమణ,ఎగమంటి ఎల్లారెడ్డి,శ్రీరామ్ సదానందం,గురజాల శ్రీధర్, సూరం పద్మ, నాయకులు మోర అజరు, పేదలుపాల్గొన్నారు.