Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వందరోజులు..వంద చావు డబ్బులు...
- అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నిరసన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన దళిత బంధు పథకానికి వంద రోజలైందనీ, ఎక్కడా అమలు కాలేదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్కజడ్సన్ విమర్శించారు. దళితు బంధు పేరుతో సీఎం వారిని దగా చేస్తున్నారని ఆరోపించారు. దళిత బంధుకు వంద రోజులు...వంద చావు డబ్బులతో శుక్రవారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహాం వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. కేసీఆర్‌కు నిర్లక్షవైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు జడ్సన్, ముంజగాళ్ల విజయకుమార్ మాట్లాడుతూ 2014 నుంచి ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ కింద ఏడాదికి రూ 10 వేల కోట్లు ఇవ్వకుండా ఎనిమిదేండ్లుగా రూ 80వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మళ్లించారని ఆరోపించారు. ఆ నిధులు దొడ్డిదారిన కాంట్రాక్టర్ మైహోం రామేశ్వరరావు, మెగా కష్ణారెడ్డి, కల్వకుంట్ల కుటుంబం, ఐఏఎస్ అధికారి రజత్‌కుమార్ జేబుల్లోకి పోయాయని విమర్శించారు. వంద రోజుల క్రితం దళిత బంధు కింద రూ 20వేల కోట్ల నిధులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ...మాల, మాదిగల మధ్య చిచ్చు పెడుతున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. దళిత బంధుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు నియమ,నిబంధనలు రూపొందించలేదని విమర్శించారు. భారత రాజ్యాంగంతోనే సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత, తన్నీరు హరీశ్‌రావు, సంతోష్‌కుమార్‌కు పదవులు వచ్చాయనీ, ఆరాజ్యాంగాన్నే మార్చాలనడం విచారకరమని అన్నారు.