Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని 24 జిల్లాల్లో సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్) నుంచి 2021-22 ఏడాదికి గాను రూ.878.55 కోట్లతో 48 రోడ్ల పనులను కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మంజూరు చేసిందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గతేడాది కేటాయించిన రూ.262 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది మూడు రెట్లు ఎక్కువగా నిధుల కేటాయించామని చెప్పారు.