Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17 వరకు నిర్వహణ
- 18 నుంచి ఓఎస్ఎస్సీ, ఒకేషషనల్ విద్యార్థులకు
- టైంటేబుల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలు-2022 మే 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు అదేనెల 17వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు శుక్రవారం టైంటేబుల్‌ను విడుదల చేశారు. పదోతరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ఓఎస్ఎస్సీ, ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు అదేనెల 18 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు (థియరీ) పరీక్ష మాత్రం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు జరుగుతుందని వివరించారు. ఈ టైం టేబుల్ రెగ్యులర్, ప్రయివేటు విద్యార్థులకు వర్తిస్తుందని తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుత విద్యాసంవత్సరంలోనూ పదో తరగతి విద్యార్థులకు ఆరు సబ్జెక్టులకు ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
పదోతరగతి పరీక్షల టైంటేబుల్
తేదీ సబ్జెక్టు
11.05.2022 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ (గ్రూప్-ఎ)
(బుధవారం) ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 (కాంపొజిట్ కోర్స్)
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 (కాంపొజిట్ కోర్స్)
12.05.2022 సెకండ్ లాంగ్వేజ్
(గురువారం)
13.05.2022 థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
(శుక్రవారం)
14.05.2022 మ్యాథమెటిక్స్
(శనివారం)
16.05.2022 జనరల్ సైన్స్ పేపర్
(సోమవారం) (ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్)
17.05.2022 సోషల్ స్టడీస్
(మంగళవారం)
18.05.2022 ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్
(బుధవారం) పేపర్-1 (సంస్కృతం, అరబిక్)
19.05.2022 ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్
(గురువారం) పేపర్-2 (సంస్కృతం, అరబిక్)
20.05.2022 ఎస్ఎస్సి ఒకేషనల్ కోర్స్ (థియరీ)
(శుక్రవారం) (ఉదయం 9.30 నుంచి 11.30 వరకు)