Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు
హైదరాబాద్ : కోన్ ఎలివేటర్ ఇండియా హైదరాబాద్‌లో తమ నూతన ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వినియోగదారులకు మరింతగా సేవలను అందించేందుకు రాష్ట్రంలో మరిన్ని కేంద్రాలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. ఈసంస్థ ఎలివేటర్, ఎస్కలేటర్ పరిశ్రమలో కీలకంగా ఉంది. తమ సంస్థ అంతర్జాతీయ వ్యూహంలో భారత్ అత్యంత కీలకమైన మార్కెట్‌గా నిలిచిందని ఆ కంపెనీ తెలిపింది. ఈ నూతన కార్యాలయాన్ని కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం ద్వారా అమ్మకాలు, ఇన్‌స్టాలేషన్స్, సేవలు, ఎఎంసి, ఆధునీకరణకు తోడ్పడటంతో పాటుగా వద్ధి చెందుతున్న వినియోగదారుల డిమాండ్ అంచనాలను సైతం తీర్చనుందని కోన్ ఎలివేటర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ గోస్పైన్ తెలిపారు. తెలంగాణాలో అభివద్ధి పరంగా ప్రభుత్వ ప్రణాళికలో భాగం కావడం పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నామన్నారు.