Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్‌లో భాగంగా తన జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయంలో టీఎస్ఐఐసీ చైర్మెన్ గ్యాదరి బాలమల్లు శనివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్యాదరి బాలమల్లు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే హరితహారం చేపట్టి లక్షలాది మొక్కలు నాటించారని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడి సీఎం అయ్యాక హరితహారం ద్వారా మరోసారి కోట్లాది మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారని అభినందించారు. సీఎం కేసీఆర్ హరితహారం స్పూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ఇండియా చాలెంజ్‌ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకువెళుతున్నారని ప్రశంసించారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు భాస్కర్ గుడల, శ్రీనివాస్‌రాజు, శ్రీనివాస్, చంద్రశేఖర్ సిక్కా, వడ్ల నందు తదితరులు పాల్గొన్నారు.