Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పోలీస్ స్టేషన్ ఆవరణలో మహిళా దళసభ్యురాలు సహా ఎనిమిది మంది మావోయిస్టులు శనివారం లొంగిపోయారు. జిల్లా ఎస్పీ సునీత్ దత్ స్థానిక పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా, ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల తుమ్రేల గ్రామానికి చెందిన మావోయిస్టు వెంకటాపురం - వాజేడు ఏరియా కమిటీ దళ సభ్యురాలు పొడి ఊరే అలియాస్ జెన్నీ, చర్ల మండలానికి చెందిన మిలీషియా సభ్యులు ఏడుగురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ 'ఏ' కంపెనీ ఎదుట శనివారం స్వచ్చంధంగా లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు వాటర్ ఫిల్టర్లు, లైట్లు, రేడియోలు ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. వారికి తమ పూర్తి సహాయసహకారాలు ఉంటాయని ఎస్పీ అన్నారు. మావోయిస్టులు అరణ్యాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేశారు.