Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెడ్ కానిస్టేబుల్ మృతి
నవతెలంగాణ-గుండాల
తుపాకి మిస్ ఫైర్ అయి హెడ్ కానిస్టేబుల్ ప్రాణం కోల్పోయాడు. ఈ ఘటన శనివారం కాచనపల్లి పోలీస్ స్టేషన్లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని కాచనపల్లి కేంద్రంగా కొనసాగుతున్న కొమరారం పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి విధులు నిర్వహించే ముందు ఆయుధాలను పరిశీలించారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు తుపాకి మిస్ ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ సంతోష్ యాదవ్(30) అక్కడికక్కడే మృతిచెందాడు. అతను వరంగల్ జిల్లా గవిచర్ల నివాసి. మూడ్రోజుల కిందటే సంతోష్‌కు తల్లిదండ్రులు పెండ్లి సంబంధం చూశారు. ఇంతలోనే ఇలా జరగడంతో తీవ్ర విషాదం నెలకొంది. తుపాకి మిస్ ఫైర్ ఘటనలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.