Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని గిరిజనుల్లో సంపూర్ణ సాధికారత సాకారమయ్యేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. రాష్ట్ర జనాభాలో 10 శాతం కంటే ఎక్కువగా గిరిజనులు ఉన్నారని చెప్పారు. విద్య, సామాజిక ఆర్థిక సంబంధాల్లో మరింత మెరుగుదల సాధించాలని అభిప్రాయపడ్డారు. శనివారం పీవీఎన్ఆర్ విశ్వవిద్యాలయంలో గిరిజనులకు రాజ్శ్రీ పక్షలు(కొడిపిల్లల పంపిణీ)కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. గిరిజనులకు ఉపాధి అవకాశాలను పెంపొందించాలని సూచించారు. రాజ్‌భవన్ పర్యవేక్షణలో పలు శాఖల సహకారంతో పైలట్ ప్రాజెక్టు చేపట్టడం మంచి పరిణామమని వ్యాఖ్యానించారు. నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలుచేయడం సంతోషకరమన్నారు. పైలట్ ప్రాజెక్టుగానే కాకుండా సాధారణ పథకంలా దీనిని అమలుచేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.