Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నేటి ఈ మానవరూపం కోట్లాది సంవత్సరాల జీవపరిణామ ఫలితమేనని విజ్ఞానదర్శిని అధ్యక్షుడు టి.రమేష్ తెలిపారు. శనివారం హైదరాబాద్లోని బాబు జగ్జీవన్ రామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రాధిక అధ్యక్షతన జీవపరిణామ సిద్ధాంతకర్త ఛార్లెస్ డార్విన్ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ పరిణామ సిద్ధాంతం అనేక ఆధారాలతో నిరూపించబడుతున్నదన్నారు. నిజాలు తెలియని కాలంలో మానవ జన్మ గురించి అనేక రకాల కల్పితాలు, ఊహలు నమ్ముతూ ఉండేవారని చెప్పారు. ఆ నమ్మకాలపై గొడ్డలిపెట్టులా జీవ పరిణామం అనే సత్యాన్ని సైన్స్ కనుగొన్నదని వివరించారు. జీవపరిణామాన్ని డార్విన్ ప్రతిపాదించిన కాలం నుంచి నేటి వరకు అనేకానేక ఆధారాలతో ఆ సిద్ధాంతం మరింత బలోపేతం అవుతున్నదన్నారు. ఈ పరిణామక్రమ సిద్ధాంతం వాస్తమనడానికి అనేకానేక శాస్త్రీయ ఆధారాలు పరిశోధనల్లో లభించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేఆర్ కళాశాల లెక్చరర్లు డాక్టర్ ఉమా, డాక్టర్ అర్చన, విజ్ఞాన దర్శిని నాయకులు కె.శోభారాణి, సీహెచ్.మహేష్ పాల్గొన్నారు. అనంతరం రమేష్ విద్యార్థుల ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.