Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో రైల్వే క్రాసింగ్‌లపై చేపట్టాల్సిన నిర్మాణాల కోసం ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలో జీహెచ్ఎంసీ, దక్షిణ మధ్య రైల్వే, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఆర్యూబీ, ఆర్ఓబీల నిర్మాణానికి వెంటనే అనుమతులిస్తే ట్రాఫిక్ రద్దీ మరింత తగ్గే అవకాశముందని కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీతో పోలిస్తే రైల్వే పనులు మందకొడిగా జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. దశాబ్దాల కింద నిర్మాణం చేసిన సికింద్రాబాద్‌లోని రామ్ గోపాల్పేట రైల్వే అండర్ బ్రిడ్జ్ వంటి వాటిని యుద్ధ ప్రాతిపదికన విస్తరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు నగర మేయర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.