Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అండ్ సిగల్ ప్రాసెసింగ్‌పై మూడు రోజులపాటు నిర్వహణ
హైదరాబాద్ : వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల రెండవ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సిగల్ ప్రాసెసింగ్ (ఏఐఎస్‌పీ-22) అంతర్జాతీయ సదస్సు వర్చువల్ విధానంలో ప్రారంభమయ్యింది. ఈ సదస్సును ఐఈఈఈ గుంటూరు సబ్ సెక్షన్‌తో కలిసి, ఐఈఈఈ హైదరాబాద్ సెక్షన్ సహకారంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా వైస్ ప్రెసిడెంట్ డేటా సెంటర్స్ మరియు ఏఐ గ్రూప్, ఇంటెల్ కార్పొరేషన్ శ్రీనివాస్ లింగం హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిగల్ ప్రాసెసింగ్‌లో తాజా పరిణామాలపై దృష్టి సారించటానికి విద్య, పరిశ్రమలకు చందిన నిపుణులకు ఈ సదస్సు ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపారు. గౌరవ అతిధి ప్రొఫెసర్, శాంతా క్లారా యూనివర్సిటీ , యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా, ప్రొఫెసర్ టోకున్బో ఒగున్ఫున్మీ మాట్లాడుతూ హాజరై ఈ సదస్సు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, సిగల్ ప్రాసెసింగ్ అంశంలో సృజనాత్మక పరిశోధన పాత్రలను ప్రచురించడానికి, అత్యాధునిక సాంకేతికత రూపకల్పన మరియు అభివృద్ధిలో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, సిగల్ ప్రాసెసింగ్ సిద్ధాంతం, రూపకల్పన, అమలు, విశ్లేషణ మరియు ధవీకరణ, లేదా అనుభావిక మూల్యాంకనం, అప్లికేషన్లలో పురోగతిపై చర్చించటానికి ఉపయోగ పడుతుందని అన్నారు. ఈ సదస్సులో ఏపీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సెలర్ డా|| ఎస్.వి. కోట రెడ్డి మాట్లాడుతూ ఈ సదస్సు 14వ తేదీ వరకు జరుగుతుందనీ, ఈ సదస్సులో దేశం నలుమూలల నుంచి, 12 దేశాల (చైనా, తైవాన్ , ఇథియోపియా, బ్రెజిల్, సౌదీ అరేబియా, అమెరికా, ఒమాన్, పోర్చుగల్, యు.ఏ.ఈ, బాంగ్లాదేశ్, మొరాకో ) నుంచి అనేకమంది ప్రతినిధులు వర్చ్యువల్ గా హాజరవుతున్నారని తెలిపారు.
అంతర్జాతీయ స్థాయి వక్తలైన డా|| ఎస్.వి. కోట రెడ్డి (వైస్ ఛాన్సలర్, వీఐటీ ఏ.పి విశ్వ విద్యాలయం ) ప్రొఫెసర్ ఎస్ పి మొహంతి ( నార్త్ టెక్సాస్ యూనివర్సిటీ), ప్రొఫెసర్. గణపతి పాండా (ఐఐటీ భువనేశ్వర్), డా|| శంకర్ ప్రక్రియా (ప్రొఫెసర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఐఐటి ఢిల్లీ ), ప్రొఫెసర్. ఆంటోనియో జోస్ న్యూన్స్ నవారో రోడ్రిగ్స్ (డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, యూనివర్సిటీ ఆఫ్ ఏవీరో ), ప్రొఫెసర్ లూసియానో వోల్కాన్ అగోస్టిని (యూనివర్సిడేడ్ ఫెడరల్ డి పెలోటాస్ ), డా|| మిలన్ బిస్వాల్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, న్యూ మెక్సికో స్టేట్ యూనివర్సిటీ, డా. నితిన్ వి. జార్జ్ (అసోసియేట్ ప్రొఫెసర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఐఐటీ గాంధీనగర్ ) హాజరై ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ మరియు సిగల్ ప్రాసెసింగ్ పై ప్రసంగిస్తారని ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అండ్ సిగల్ ప్రాసెసింగ్ కన్వీనర్ డా|| ఉమా కాంత్ నందా తెలిపారు.