Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మేడారం సమ్మక్క సారక్క జాతర డాక్యుమెంటరీని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం విడుదల చేశారు. శనివారం హైదరాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్యను ఆమె ఘనంగా సన్మానించారు. అంతరించిపోతున్న కళను బతికించటానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సమ్మక్క సారక్క జాతరలో రామచంద్రయ్యకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని ప్రశంసించారు. డాక్యుమెంటరీని రూపొందించిన ఫిల్మ్ మేకర్ బాలాజీ దూసరిని కవిత ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తెలంగాణ జాగృతి జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.