Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సమాన అవకాశాలు, సమభావనతోనే సమాజంలో సుఖశాంతులు నెలకొంటాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం ముచ్చింతల్‌లోని రామానుజాచార్యుల విగ్రహాన్ని తన భార్య, ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ ఎ.ఉషా దయాకర్‌రావు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. లక్ష్మీనారాయణ క్రతువులో పాల్గొన్నారు. చినజీయర్ స్వామి తన గురువు పేరిట ఇచ్చే గోపాలోపాయన పురస్కారాన్ని తమిళనాడుకు చెందిన మాడభూషి వరదరాజన్‌కు మంత్రి అందజేశారు. వెయ్యేండ్ల కిందటే ప్రపంచానికి సమతను చాటిన రామానుజుల వారి భారీ విగ్రహాన్ని ముచ్చింతల్‌లో ప్రతిష్టించటం గర్వకారణనీ, విగ్రహ ఏర్పాటు రాష్ట్ర ప్రతిష్టతను మరింత పెంచిందని అన్నారు.
రామానుజుల వారి దృక్పథమే ప్రపంచానికి ఏకైక దారి అని నొక్కిచెప్పారు.
జగపతిబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి
సీనియర్ సినీ నటులు జగపతిబాబుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని జగపతిబాబు ఇంటికి ఆయన స్వయంగా వెళ్లారు. జగపతిబాబు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలనీ, మరిన్ని సినిమాల్లో నటించి గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.