Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దక్ష్షిణ మధ్య రైల్వేలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 మిలియన్ టన్నుల సరుకు రవాణా, పది కోట్ల మంది ప్రయాణీలతో అగ్రగామిగా ఉన్నదని ఆ సంస్థ జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ తెలిపారు. కోవిడ్ విపత్కర పరిస్థితులు తర్వాత క్రమేణా సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు తెలిపారు. బొగ్గు, సిమెంట్, స్టీల్, కంటైనర్లు, ఆహారధాన్యాలు, ఎరువులు, ఇతర సరుకుల రవాణాను చేపట్టామన్నారు. జోన్ పరిధిలో అన్ని రిజర్వుడు సెగ్మెంట్లలో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించామనీ, డిమాండ్‌ను బట్టి ప్యాసింజర్ రైళ్లను నడుపుతున్నామని చెప్పారు.