Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వివక్షలేని సమాజ నిర్మాణంలో యువతరం భాగాస్వామ్యం కావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శనివారంనాడాయన ముచ్చింతల్‌లోని రామానుజుల సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులమతాలకంటే గుణమే మిన్న అనీ, దాన్నే రామానుజులు ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఇదే తరహా సమానత్వం కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇదే కేంద్రంలో ఆధ్యాత్మికతతో పాటు తెలుగు వారి సంస్కతి సంప్రదాయాలు, భాషాభివృద్ధికి ఉపయోగపడే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన చినజీయర్‌కు సూచించారు. శనివారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర వినియోగదారులు వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, సినీ నటులు చిరంజీవి తదితరులు రామానుజుల విగ్రహాన్ని సందర్శించారు.