Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఏసీ కార్యక్రమాల్లో మార్పులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ ఆందోళనా కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు చేస్తూ శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నట్టు చైర్మెన్ కే రాజిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వైస్‌చైర్మెన్ కే హన్మంతు ముదిరాజ్, కన్వీనర్లు వీఎస్ రావు, పి కమాల్‌రెడ్డి, కో కన్వీనర్లు సుద్దాల సురేష్, జీ అబ్రహం పాల్గొన్నట్టు వివరించారు. సమావేశ నిర్ణయాలు ఇవీ...
- మేడారం జాతర సందర్భంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 25 వరకు పొడిగించాలని నిర్ణయించారు.
- ఫిబ్రవరి 15న ఇందిరాపార్కు వద్ద జరగాల్సిన నిరాహారదీక్షను ఫిబ్రవరి 26కు వాయిదా వేశారు.
- సంతకాల సేకరణ చేసిన లిస్ట్‌ను మూడు సెట్ల జిరాక్స్ తీసుకోవాలి. ఒరిజినల్ సెట్‌ను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌కు రిజిస్టర్ పోస్ట్ చేయాలనీ, దానిపై జేఏసీిలోని ఒక నాయకుని ఇంటి అడ్రెస్నుఎక్నాలెడ్జ్మెంట్ కార్డ్ పైన వ్రాసి పంపి, తిరిగి మీకు వచ్చిన ఆ కార్డును వాట్సప్ ద్వారా జేఏసీనాయకత్వానికి పంపాలనినిర్ణయిం చారు.
- ఫిబ్రవరి 26న ఇందిరాపార్కు వద్ద జరిగే రిలే నిరాహారదీక్షకు వచ్చేటప్పుడు సంతకాలు చేసిన రెండు జిరాక్స్ సెట్లను తీసుకుని రావాలని క్షేత్రస్థాయి నాయకత్వానికి సూచించారు.
- ఫిబ్రవరి 15న కమీషనర్ ఆఫ్ కో-ఆపరేటీవ్ మరియు రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటీవ్ సొసైటీస్ గారికి టీఎస్ఆర్టీసీ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (సీసీఎస్) లో ఎన్నికలు నిర్వహించాలని వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు.
- ఫిబ్రవరి 21న ఆర్టీసీ పరిరక్షణ, కార్మిక సమస్యల పరిష్కారం కోసం ట్రేడ్ యూనియన్ నాయకులు, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు.
- అన్ని డిపోల్లో సంతకాలు చేసిన లిస్టుల సెట్‌ను మార్చి 7వ తేదీన రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో లేబర్ కమీషనర్‌కు ఇవ్వాలని నిర్ణయించారు.
- అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆర్టీసీపై బ్రీఫ్ నోట్ తయారు చేసి ఇస్తారు.