Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ, గిరిజన సంక్షేమ శాఖలూ గురుకుల సిబ్బందికి పీఆర్సీ అమలు చేయాలి : టీఎస్‌యూటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సిబ్బందికి పీఆర్సీ అమలు చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్ జీవో నెంబర్ 10ని జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి తెలిపారు. ఈ మేరకు శనివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖలు కూడా సంబంధిత గురుకులాల సిబ్బందికి నూతన వేతనాల అమలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. జూన్ 2021 నుంచి రావాల్సిన బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.