Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూలో నిలబడ లేక చెప్పులు పెట్టిన వైనం
నవతెలంగాణ-మఠంపల్లి
యూరియా కొరత తిప్పలు మళ్లీ మొదలయ్యాయి. రైతులు తెల్లవారకముందే ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద లైన్ కట్టారు. పొద్దెక్కే కొద్దీ నిలబడే శక్తి లేక చెప్పులనే లైన్లో ఉంచారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో శనివారం జరిగింది. తమకు వెంటనే యూరియా ఇవ్వాలని అన్నదాతలు అధికారులను కోరారు. మఠంపల్లి సంఘంలో 20 టన్నుల యూరియా అందించామని, మరో 20 టన్నులు బిల్యానాయక్ తండాలో అందజేశామని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం సీఈఓ తిరుపతయ్య అన్నారు. సోమవారం నాటికి రైతులకు యూరియా అందజేస్తామని చెప్పారు.