Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న విద్యుత్ సవరణ చట్టం రైతులకు, పేద, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల బాధలను అర్థం చేసుకున్న నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్తు ఇచ్చి రైతును విద్యుత్ భారాల నుంచి తప్పించారని తెలిపారు. ఇక్కడి సీఎం కేసీఆర్ వ్యవసాయ బావులకు విద్యుత్ మీటర్లను బిగించబోమని చెప్పడం, విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడం హర్షణీయమని పేర్కొన్నారు.