Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి
నవతెలంగాణ-చౌటుప్పల్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద రాజకీయాలను వ్యతిరేకించాలని సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక విద్యాలయాల్లో మతం, కులం పేరుతో భావోద్వేగాలను రెచ్చగొడుతుందని విమర్శించారు. అందరికి స్వేచ్ఛగా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. సుప్రీంకోర్టు సామరస్యంగా వ్యవహరించి పౌరుల హక్కులను కాపాడాలన్నారు. బీజేపీ నాయకత్వం మత ప్రచారాన్ని ఆపాలని, ఇది ఇలాగే కొనసాగితే దేశం అల్లకల్లోలం అయ్యే అవకాశం ఉందన్నారు.హైదరాబాద్ ముచ్చింతల్లో ఏర్పాటు చేసిన రామానుజన్ సమతామూర్తి విగ్రహాన్ని సనాతనధర్మం కోసం వాడుతున్నారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ ప్రజలకు వ్యతిరేకంగా, కార్పొరేట్శక్తులకు అనుకూలంగా ఉందన్నారు. దాం తో పేదరికం మరింత పెరుగుతుందని, సమస్యలు మరింత పెరుగుతాయని తెలిపారు. చిన్న పరిశ్రమల కు రాయితీలు తగ్గించి..ప్రభుత్వరంగ సంస్థలను అమ్మాలని కేంద్రం చూస్తున్నదన్నారు. బీజేపీ అధికార ంలోకి వచ్చాక దళితుల మీద దాడులు పెరిగాయ న్నారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్లో ప్రజలను చైతన్యపరిచి ఉధృతంగా పోరాటాలు చేస్తామన్నారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎమ్డీ జహంగీర్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, రొడ్డ అంజయ్య, మండల, మున్సిపల్ కార్యదర్శులు గంగదేవి సైదులు, బండారు నర్సింహ, జిల్లా కమిటీ సభ్యులు ఎమ్డీ పాషా, గడ్డం వెంకటేశం పాల్గొన్నారు.