Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీఎస్కే కన్వీనర్ జి రాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వంలో రిటైర్డ్ మెడికర్ ఆఫీసర్ గా పని చేసి, 300 గజాల స్థలాన్ని ఉచితంగా ఇవ్వడమే గాక అంబేద్కర్ శతాబ్ది భవన్‌ను నిర్మించి, 16మంది సామాజికోద్యమకారుల విగ్రహాలను నెలకొల్పిన డాక్టర్ స్వామి అల్వాల్ కృషి నేటి తరానికి స్ఫూర్తి దాయకమని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర కన్వీనర్ జి రాములు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని అంబేద్కర్ శతాబ్ది భవన్లో డాక్టర్ స్వామి అల్వాల్ సామాజిక కృషికి సంబంధించిన పుస్తకాన్ని గోసుల విజరుకుమార్ అధ్యక్షతన జరిగిన సభలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ సామాజిక ఉద్యమ మహనీయుల త్యాగాల ఫలితమే నేటి అణగారిన తరగతుల మార్పులకు మూలకారణమని చెప్పారు. అంబేద్కర్ పే బ్యాక్ టు సొసైటీని అనేక మంది ఉద్యోగులు అధికారులు ఆచరించాలన్నారు. రాజ్యాంగం మార్పు అనేది మనువాదుల ఆకాంక్షని చెప్పారు. దాని రక్షణ కోసం రాజకీయలకతీతంగా ఉద్యమించాలన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ సామాజిక ఉద్యమాల్లో పని చేస్తున్న కార్యకర్తలకు ఆయన ఒక మార్గదర్శకుడిగా ఉంటారని చెప్పారు. పుస్తక రచయిత డాక్టర్ స్వామి అల్వాల్ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఎం ఆర్ పీ ఎస్ జిల్లా నాయకులు బాలకృష్ణ ,రజక రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు గోపి ,బలహీనవర్గాల సంక్షేమ సమితి అధ్యక్షులు ఎరుకల మహేందర్ గౌడ్, సతయ్య రానుగుల వేణు,రమేష్ ముక్కెర రాజేష్ అన్నపూర్ణ బాగ్యలక్ష్మీ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.