Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా నిర్వహించండి...
- రేపటి నుంచి 17 వరకు సేవా కార్యక్రమాలు : కేటీఆర్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రదాత, సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పిలుపునిచ్చారు. ఈ నెల 15,16,17 తేదీల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 60 ఏండ్ల తెలంగాణ కలను సాకారం చేసిన కేసీఆర్ దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని అభివ ృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. ఎవరికి తోచిన విధంగా వారు సేవా థృక్పథాన్ని చాటేలా సేవా కార్యక్రమాలు ఉండాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. మూడు రోజులు పార్టీ శ్రేణలు నిర్వహించాల్సిన కార్యక్రమాల షెడ్యూల్ను విడుదల చేశారు. 15న రాష్ట్రవ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలనీ, రాష్ట్రంలో ఉన్న అన్ని ఆస్పత్రులు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు తదితర చోట్ల పండ్లు, ఆహారం, దుస్తుల పంపిణీని చేపట్టాలని కోరారు. 16న నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు, 17న కేస్షీర్ జన్మదినం సందర్భంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు.