Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం పదవి నుంచి తొలగించాలి : రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సోం ముఖ్యమంత్రి హేమంత బిశ్వాస్ శర్మ చేసిన వ్యాఖ్యలు మాతృత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించాలని బీజేపీని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్లోని గాంధీభవన్లో జరిగిన పలు కార్యక్రమాల్లో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారత్ మాతాకీ జై అంటూనే బీజేపీ నేతలు ఆ మాతనే అవమానించేలా మాట్లాడుతున్నారని తెలిపారు. హేమంత్ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. గాంధీభవన్లో జరిగే సభ్యత్వ నమోదు సంబరాలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.