Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ఎం. సాయిబాబు ఉద్యమావసరాలరీత్యా అఖిలభారత కేంద్రానికి వెళ్తున్నందున ఆ స్థానంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పాలడుగు భాస్కర్‌ను ఎన్నుకున్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎజె. రమేష్ (కొత్తగూడెం జిల్లా), రాష్ట్ర కార్యదర్శిగా రాగుల రమేష్ (హన్మకొండ)లను కో-ఆప్షన్స్‌గా తీసుకున్నారు.ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ సాయిబాబు ఉమ్మడి రాష్ట్రంలో సీఐటీయూ అధ్యక్షులుగా, తెలంగాణ ఏర్పడిన అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారని అభినందించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.సుధాభాస్కర్, ఎస్ వీరయ్య, కార్యదర్శులు ఎస్వి రమ, మాట్లాడారు.