Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తంబీ ఏవియేషన్ సంస్థ తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖతో కలిసి సంయుక్తంగా మేడారం జాతరకు హెలికాప్టర్ సర్వీసును ఆదివారం నుంచి ప్రారంభించింది. హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ నుంచి మేడారం వరకు ఈ సర్వీసును నిర్వహించనుంది. సమ్మక్క సారాలమ్మ జాతరకు వెళ్లే భక్తులు ఈ సర్వీసును వినియోగించుకోవాలని ఆ సంస్థ తెలియజేసింది.